కొనుగోళ్లు బంద్‌..!

cotton farmers protest in warangal market - Sakshi

నిమ్ము పత్తిని కొనని వ్యాపారులు

నిరసన తెలిపిన రైతులు

ఏకతాటిపై నిలిచిన ఖరీదుదారులు

అడ్తిదారుల ప్రయత్నాలు విఫలం

వ్యాపారులకే మద్దతు తెలిపిన జేసీ 

మార్కెట్‌లోనే పత్తిని ఆరబెట్టిన రైతులు

కొన్ని వాహనాలు తిరుగు ప్రయాణం

త్వరలో 4 రోజులపాటు సెలవు !

వరంగల్‌ సిటీ: నిమ్ము పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. తేమ మిషన్లలో లోపాలు ఉన్నాయని.. పత్తిని కొనుగోలు చేయాల్సిందేనని రైతులు పలుమార్లు మార్కెట్‌ కార్యాలయం వద్ద గొడవకు దిగడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినా.. ఖరీదుదారులు స్పందించకపోవడంతో పలువురు రైతులు మార్కెట్‌ ఆవరణలోనే పత్తిని ఆరబెట్టారు. కొందరు మాత్రం వాహనాల్లో ఇంటిబాట పట్టారు.
 

అడ్తిదారుల ప్రయత్నాలు విఫలం
నిమ్ము పత్తి కొనుగోలు చేసేది లేదని ఖరీదుదారులు స్పష్టం చేసినప్పటికీ.. అడ్తిదారులు తమ ప్రయత్నాలను కొనసాగించారు. నిమ్ము పత్తిని తక్కువ ధరతో కొనుగోలు చేయించడానికి చివర వరకూ ప్రయత్నించారు. ఓ దశలో రైతులను రెచ్చగొట్టి మార్కెట్‌ కార్యాలయం మీదకు పంపిం చినట్లు సమాచారం. అంతేకాదు.. మార్కెట్‌లోని మిని చాంబర్‌లో ఖరీదు దారులతో అడ్తిదారులు సమావేశమై చర్చించారు. అయినప్పటికీ ఖరీదుదారులు ఏకతాటిపై నిలిచి పొడి పత్తిని మాత్రమే క్వింటాల్‌కు రూ.4,850తో కొనుగోలు చేశారు. జేసీతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందా మని తెలిపారు.

సెలవన్నట్లే..?
ఎట్టకేలకు జేసీ దయానంద్‌తో మార్కెట్‌ చైర్మన్‌ ధర్మరా జు, కార్యదర్శి నిర్మల మాట్లాడారు. నిమ్ము పత్తి కొనుగో ళ్ల స్తంభనపై వివరించారు. ఈ సందర్భంగా జేసీ.. ‘అడ్తిదారులు, వ్యాపారుల అభ్యర్థన మేరకే నిర్ణ యం తీసుకున్నాం. ఎప్పుడో ఒకసారి కఠిన నిర్ణయం తీ సుకోకుంటే భవిష్యత్‌లో ఇబ్బంది కలుగుతుంది. ఓ రెం డు రోజులు చూద్దాం. అందరికీ తెలిసి రావాలి. అవగా హన కలగాలి.’ అని అన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మార్కెట్‌ అధికారులు, అడ్తిదారులు, వ్యాపారులు సా యంత్రం మరోసారి సమావేశమయ్యారు. సోమవారంతోపాటు మంగళవారం మార్కెట్‌కు వచ్చే నిమ్ము పత్తిని పరిశీలించి, అన్నింటినీ కొనుగోళ్లు చేద్దామని.. ఆ త ర్వా త 4 రోజులు మార్కెట్‌ బంద్‌ చేద్దామని నిర్ణయించారు.

మిషన్లలో లోపాలు..: నిమ్ము పేరిట కొర్రీలతో పత్తిని కొనుగోలు చేయకపోవడం పై రైతులు మండిపడ్డారు. నిమ్ము శాతం కొలిచే యంత్రాల్లో లోపాలు ఉన్నాయని.. వాటిని సెట్‌ చేసి పెట్టుకున్నారుని ఆరోపించారు. ఓ పత్తిని ఒక మిషన్‌తో పరిశీలిస్తే 14, మరో మిషన్‌తో పరిశీలిస్తే 18 శాతం, ఇంకో మిషన్‌తో ప రిశీలిస్తే 21 శాతం చూపిస్తున్నదని వివరించారు.  అయినా ఖరీదుదారులు ససేమిరా అంటూ కొనుగోలు చేయకపోవడంతో కొందరు రైతులు పత్తి వాహనాలతో తిరుగు ప్ర యాణమయ్యారు. అవిపోనూ సాయంత్రం వరకు రెండు వేలకు పైగా పత్తి బస్తాలు మార్కెట్‌ యార్డులోనే ఉన్నాయి.

తేమ మిషన్లతోనే మోసం...

మార్కెట్‌లో తేమ శాతాన్ని కొలిచే మిషన్లలోనే అనేక లోపాలు ఉన్నాయి. వాటితోనే మోసం చేస్తున్నారు. ఒక్కో మిషన్‌ ఒక్కో రకంగా చూపిస్తోంది. నా పత్తినే 14, 18, 21 శాతం అని చూపించాయి. దేన్ని నమ్మాలి.. పైగా రూ.వెయ్యికి తక్కువ ఇస్తే ఏదోలా అమ్మిస్తామని కొందరు రకరకాలుగా పరేషాన్‌ చేస్తున్నారు.
– కొడెం శ్రీనివాస్, పత్తి రైతు, మహేశ్వరం

Read latest Warangal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top