హైదరాబాదీ ఫొటోలకు గిరిజనుల ఫిదా

photo exbition in andhra odisha border - Sakshi

ఏవోబీలో బొండా జాతి

మహిళల ఫొటోలతో ఎగ్జిబిషన్‌

ముంచంగిపుట్టు(అరకులోయ): ఆంధ్రఒడిశా సరిహద్దు ప్రాంతమైనా ఒనకఢిల్లీ వారపు సంతలో హైదరాబాద్‌కు చెందిన సతీష్‌లాల్‌ అనే ఫొటో గ్రాఫర్‌ గురువారం ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. సరిహద్దులోగల బొండా జాతి గిరి మహిళలు   జీవన శైలిని ప్రతిబింబించే 120  ఫొటోలతో ఈ ప్రదర్శన నిర్వహించారు.

రెండు సంవత్సరాల క్రితం ఆయన ఒనకఢిల్లీని  సందర్శించినపుడు  తీసిన చిత్రాలతో  అదే గ్రామంలో సొంతంగా ప్రదర్శన నిర్వహించారు.  మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం ఎస్‌ఈ డి.గోపాలకృష్ణమూర్తి, డీఈలు భాస్కర్,ఉదయ్‌కుమార్,సర్పంచ్‌ జగన్నాథం వంతాల్‌  గురువారం ఈ ఎగ్జిబిషన్‌ ను ప్రారంభించారు. సంతకు వచ్చిన సరిహద్దు గిరిజనులు,విదేశీయులు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. బొండజాతి మహిళలుసైతం తమ ఫొటోలను తిలకిస్తూ ఎంతో సంబరపడ్డారు. కొందరు బొండాజాతి మహిళలకు వారి ఫొటోలను   సతీష్‌లాల్‌ ఉచితంగా అందజేశారు.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top