గిరిజన తండాలో సినీనటి అమల సందడి

Film actress Amala at Tribal thanda - Sakshi

కుల్కచర్ల: ప్రముఖ సినీనటి, బ్లూక్రాస్‌ సొసైటీ నిర్వాహకురాలు అక్కినేని అమల గిరిజన తండాలో సందడి చేశారు. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం రాంరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని అల్లాపూర్‌ తండాను ఆదివారం ఆమె సందర్శించారు. రాంరెడ్డిపల్లి మాజీ సర్పంచ్‌ మాణెమ్మ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా చిన్న కుటుంబాలే కనిపిస్తున్నాయని, ఇలాంటి సమయంలోనూ 36 మందితో ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్న మాణెమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అక్కినేని నాగేశ్వర్‌రావు స్థాపించిన అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అండ్‌ ఫిలిమ్స్‌ మీడియా పాఠశాలకు అమల డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇందులో పనిచేసే సిబ్బందికి గ్రామీణ ప్రాంతాలు, వారి జీవన స్థితిగతులు, వ్యవసాయం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు తండాలను సందర్శించారు. 
 

Read latest Vikarabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top