చికాగోలో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
చికాగో :
చికాగోలో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారయణస్వామి ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. చికాగోలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
నాటా అధ్యక్షులు గంగసాని రాజేశ్వర రెడ్డి, కందిమల్ల సత్యనారయణరెడ్డి, నాటా బోర్డ్ మెంబర్ కురసపాటి శ్రీధర్ రెడ్ది, చికాగో నాటా వైస్ ప్రెసిడెంట్ వెంకట రెడ్డి, అమెరికా వైఎస్సార్సీపీ ప్రతినిధులు ఆర్వి రెడ్డి, కెఎస్ఎన్ రెడ్డిలు వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వ లక్షణాలను కొనియాడారు. మిమిక్రి ఆర్టిస్ట్ రమేశ్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆనుకరిస్తూ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.
ఈ వేడుకల్లో ప్రముఖ చిత్రకారుడు పద్మశ్రీ ఎస్ వి రామారావును ఘనంగా సత్కరించారు. రామరావుని చికాగో సాహితీ మిత్రుల ప్రతినిధి మెట్టుపల్లె జయదేవరెడ్డి సభకు పరిచయం చేశారు. ఎస్ వి రామారావు మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్ది ఒక గొప్ప ప్రజానాయకుడని, పేదప్రజలు ఎప్పుడూ ఆయనను తలచుకుంటూ ఉంటారన్నారు. ప్రెసిడెంట్ కెనెడీ లాగే రాజశేఖరరెడ్డికి ప్రత్యేక ఆకర్షణ ఉందని ఆయనను చూడగానే నమస్కరించి గౌరవించాలనిపిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆటా మాజీ అధ్యక్షులు హనుమంత రెడ్డి, గవ్వ సంధ్య, హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగోమాజీ ఆధ్యక్షులు భీమా రెడ్డి, ఐఏజీసీ ప్రతినిధులు సురేష్, గోపిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, టీఏజీసీ ప్రతినిధులు రామచంద్రా రెడ్డి, ప్రదీప్ రెడ్డి, నాటా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ లింగారెడ్ది, వెంకటరెడ్డి, హేమ సుందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.