మలేషియాలో ఘనంగా ఉగాది సంబరాలు | Telugu Association of Malaysia ugadi celebrations | Sakshi
Sakshi News home page

మలేషియాలో ఘనంగా ఉగాది సంబరాలు

Apr 23 2017 10:32 PM | Updated on Sep 5 2017 9:31 AM

మలేషియాలో ఘనంగా ఉగాది సంబరాలు

మలేషియాలో ఘనంగా ఉగాది సంబరాలు

తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా (టామ్) ఆధ్వర్యములో ఉగాది వేడుకలు మరిడేక స్క్వేర్ లో ఆదివారం ఘనంగా జరిగాయి.

తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా (టామ్) ఆధ్వర్యములో ఉగాది వేడుకలు మరిడేక స్క్వేర్ లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలేషియా ఉప ప్రధాని అహమ్మద్ జహీద్ విచ్చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆట పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన తెలుగు వారందరికీ టామ్ ప్రెసిడెంట్ డాక్టర్ అచ్చయ్య కుమార్ కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ కార్యక్రమానికి మలేషియా తెలంగాణ అసోసియేషన్ (ఎంవైటీఏ) తన వంతు సహకారాన్ని అందజేసినందుకు గాను తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ డాక్టర్ అచ్చయ్య కుమార్.. మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతిని, ఉపాధ్యక్షుడు సత్యలను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మరికొందరికి జ్ఞాపికలు అందజేసి సన్మానించారు.




Advertisement
 
Advertisement
Advertisement