తొలితరం ఉద్యమ నేత..!

సంగంరెడ్డి సత్యనారాయణ


విశ్లేషణ

జీవితమంతా తెలంగాణ కోసం ఉద్యమించిన పోరాటయోధుడు, వాగ్గేయకారుడు సంగంరెడ్డి సత్యనారాయణ మనమధ్య నుంచి నిష్ర్కమించారు కాని ఆయన చూపిన మార్గం, ఆదర్శాలు మిగిలే ఉన్నాయి.



ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన తొలి తరం నాయకుల్లో ముందువరుసన నిలిచిన సంగంరెడ్డి సత్యనారా యణ అక్టోబర్ 10న హైదరా బాద్‌లో మరణించారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. తల్లిదండ్రులు నర్సమ్మ, నర్సయ్య. ఉద్యమ నాయకుడు, కవి వాగ్గే యకారుడు, మంచివక్త, మాజీ మంత్రి సంగంరెడ్డి (ముచ్చర్ల) సత్యనారాయణ సొంత ఊరు హన్మకొండ మండలంలోని ముచ్చర్ల. బాల్యం నుంచి చురుకుతనంతో ఆటపాటలందు ఆసక్తే కాకుండా శ్రీకృష్ణ తులాభారం, సత్యహరిశ్చంద్ర వంటి నాటకాలు వేసి బహుమతులు గెల్చుకున్నారు. ఇంటర్మీడియట్‌లో సహవిద్యార్థి అయిన జయశంకర్ ఆ నాటకాల్లో స్త్రీ పాత్రలు వేసేవారు.

 

1952 నాటి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, నాన్‌ముల్కి గోబ్యాక్ ఉద్య మాన్ని వరంగల్లులో మొదట ఆరం భించినవారు సంగంరెడ్డి. పోలీస్ యాక్షన్ చర్య తర్వాత హైదరాబాద్ రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు చేపట్టిన మిలిటరీ జనరల్ జయంతినాధ్ చౌదరి అధికార భాషలో చదివి ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న సివిల్, పోలీస్ అధి కారులతో సహా దాదాపు 50 వేల పోస్టులను రద్దు చేసి వారి స్థానంలో ఆంగ్లం తెలిసిన నాన్ ముల్కిలైన ఆంధ్ర ప్రాంతం వారిని వివిధ పోస్టుల్లో నియమించటంతో ముల్కీ, నాన్ ముల్కీ సమస్య ఉత్పన్నమైంది.



పుండు మీద కారంలా అప్పటి వరంగల్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా పనిచేసిన సెటిలర్ పార్థసారథి ఏకపక్షంగా 180 మంది స్థానిక ఉపాధ్యాయులను దూరప్రాంతా లకు బదిలీ చేసి వారి స్థానంలో ఆంధ్రప్రాంతం వారిని నియమించడంతో వరంగల్‌లో ఆందోళన మొదలైంది. ఆ ఆందోళనలో ముందుభాగాన నిల్చిన సత్యనారాయణ విద్యార్థి యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమంలో కీలక భూమిక పోషించారు.



1953 డిసెంబర్‌లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నాటి ఒరిస్సా గవర్నర్ సయ్యద్ ఫజల్ ఆలీ చైర్మన్‌గా స్టేట్ రీ ఆర్గనైజింగ్ కమిటీని యేర్పాటు చేసినప్పుడు రాబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించిన సత్యనారాయణ ‘తెలం గాణ సోదరా తెలుసుకోరానీరా మోస పోకురా, గోస పడుతవురా’ అంటూ జరిగే మోసాన్ని ముందుగానే ఊహించి హెచ్చరించారు. తాను ఊహించి నట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  పెద్దమ నుషుల ఒప్పందాన్ని, రక్షణ సూత్రాలను యధేచ్చగా ఉల్లంఘిం చడంతో సంజీవరెడ్డి మామ.. సంజీవరెడ్డి మామ... చోడోజీ తెలంగాణ.. చేలే జావో రాయలసీమ అంటూ పాట ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత వెల్లు వెత్తిన 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో ఈ పాట రణన్నినాదమైంది.



టి పురుషోత్తమరావుతో కలిసి తెలం గాణ రక్షణల ఉద్యమ సమితిని స్థాపించి తెలంగాణ జిల్లాలన్నీ తిరిగి అనేక బహిరంగ సభలను నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారు. ఆ సమయంలోనే స్థానికు లకు పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ విద్యుత్ స్టేష న్‌లో ఉద్యోగ నియామకాల విషయంలో స్థానికులకు జరి గిన అన్యాయం ఉద్యమ రూపం దాల్చి 1969 నాటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి అంకురా ర్పణ చేసింది. దాంట్లో భాగంగా జనవరి 8, 1969న ఖమ్మంలో అన్నబత్తుల రవీంద్రనాధ్ అనే విద్యార్థి తెలం గాణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన సందర్భంగా  తన మాటపాటలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడు.

 

రాజకీయ నాయకత్వం లేకుండా ఉద్యమం గెలు పొందదని గ్రహించి, ఉద్యమానికి దూరంగా ఉన్న మర్రి చెన్నారెడ్డిని ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ ‘రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైన రావేమీ వెర్రి చెన్నారెడ్డి’ అంటూ పాట ద్వారా పిలుపునిచ్చాడు.  కానీ ఉవ్వె  త్తున లేచిన తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర పాలకులు తుపాకి కాల్పులతో అణిచివేశారు. అయినా తెలంగాణ ఆకాంక్ష చావని సత్యనారాయణ జై తెలంగాణ పత్రిక స్థాపించి తెలంగాణ భావజాల ప్రచారం చేపట్టారు.

 

1959లో పంచాయితీ రాజ్ వ్యవస్థ వచ్చిన తర్వాత తొలుత ముచ్చర్ల గ్రామసర్పంచ్‌గా, హసన్‌పర్తి, ఆ తర్వాత హన్మకొండ పంచాయితీ ప్రెసిడెంటుగా సేవలం దించి.. తన ఊరిపేరైన ముచ్చర్ల సత్యనారాయణగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడు. 1983లో ఎన్టీరామారావు స్థాపించిన టీడీపీ తరఫున హన్మకొండ నియోజక వర్గం అభ్యర్థిగా పోటీ చేసి తన రాజకీయ గురువు, కాంగ్రెస్ సీనియర్ నేత హయగ్రీవాచారిపై 18 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.



వెంటనే మంత్రి వర్గంలో రవాణా శాఖ మంత్రిగా కేబినెట్ హోదా కల్పిం చారు. కానీ స్వతంత్ర వ్యక్తిత్వం, తలవంచని నైజం కలి గిన సత్యనారాయణ రాజకీయాలకు దూరమై చాలా కాలం ఒంటరిగా ఉండి పోయారు. 2001న కె. చంద్ర శేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి మలి దశ ఉద్యమం ప్రారంభించినప్పుడు సీనియర్ ఉద్యమ నేత సత్యనారాయణ ఇచ్చిన సూచనలు ఉద్యమ నిర్మా ణానికి ఎంతగానో తోడ్పడ్డాయి. జీవితమంతా తెలం గాణ కోసం ఉద్యమించిన పోరాటయోధుడు సత్యనారా యణ మనమధ్య నుంచి నిష్ర్కమించాడు కాని ఆయన చూపిన మార్గం, ఆదర్శాలు మిగిలే ఉన్నాయి.

(నేడు ఉదయం 11 గంటలకు  హన్మకొండ,  నక్కలగుట్టలోని నందనా గార్డెన్‌లో సంగంరెడ్డి సత్యనారాయణ సంస్మరణ సభ)



వ్యాసకర్త: పి. చంద్

మొబైల్ : 95730 93526

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top