టీనేజ్ యువతులపై యువకుడు యాసిడ్ దాడి | Two teenage girls attacked with acid | Sakshi
Sakshi News home page

టీనేజ్ యువతులపై యువకుడు యాసిడ్ దాడి

Nov 17 2013 11:12 PM | Updated on Apr 8 2019 6:21 PM

వివాహ ప్రతిపాదనను నిరాకరించినందుకు ఇద్దరు టీనేజ్ యువతులపై ఓ యువకుడు యాసిడ్ దాడికి చేశాడు.

వివాహ ప్రతిపాదనను నిరాకరించినందుకు ఇద్దరు టీనేజ్ యువతులపై ఓ యువకుడు యాసిడ్ దాడికి చేశాడు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని బేగంపూర్ లో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం మార్కెట్ కు వెళుతున్న పార్వతి(18), గాయత్రి (16)లపై మనోజ్ అనే నిందితుడు యాసిడ్ తో దాడి చేసినట్టు పోలీసుల వెల్లడించారు.  
 
వివాహితుడు మనోజ్ చేసిన ప్రతిపాదనను పార్వతి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. పార్వతికి 50 శాతం, గాయత్రికి 20 శాతం  గాయలయ్యాయని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి సమీపంలోని ఓ ఆస్పత్రిలో వీరిద్దరికి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలం నుంచి పారిపోతున్న నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement