సంజయ్ దత్ కు నెల రోజుల పెరోల్ మంజూరు | Sanjay Dutt granted parole for one month | Sakshi
Sakshi News home page

సంజయ్ దత్ కు నెల రోజుల పెరోల్ మంజూరు

Dec 6 2013 8:53 PM | Updated on Sep 2 2017 1:20 AM

సంజయ్ దత్ కు నెల రోజుల పెరోల్ మంజూరు

సంజయ్ దత్ కు నెల రోజుల పెరోల్ మంజూరు

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు 30 రోజుల పెరోల్ ను ఎర్రవాడ జైలు అధికారులు మంజూరు చేశారు

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు 30 రోజుల పెరోల్ ను ఎర్రవాడ జైలు అధికారులు మంజూరు చేశారు. దాంతో పూణేలోని ఎర్రవాడ జైలు నుంచి మరోసారి పెరోల్ పై సంజయ్ దత్ విడుదల కానున్నారు. తన భార్య మాన్యత అనారోగ్యంతో బాధపడుతుందని సంజయ్ దత్ చేసిన పెరోల్ పిటిషన్ జైలు అధికారులు పరిశీలించారు. 
 
ఆ తర్వాత సంజయ్ కు పూణే డివిజినల్ కమిషనర్ పెరోల్ ను మంజూరు చేశారు. వైద్యం నిమిత్తం అక్టోబర్ ఒకటవ తేదిన సంజయ్  రెండు వారాల పెరోల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆతర్వాత ఆ పెరోల్ ను మరో రెండు వారాలు పొడిగించారు. దాంతో సంజయ్ అక్టోబర్ 30 తేదిన తిరిగి జైలుకు చేరుకున్నారు. 
 
తాను కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాను. అయితే మునపటి కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. త్వరలో బయటకు రావాలని దేవుడ్ని ప్రార్ధించండి అని అక్టోబర్ 30 తేదిన సంజయ్ అన్నారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు 42 నెలల జైలుశిక్షను కోర్టు ఖారారు చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement