కూతురికి జుకర్‌బర్గ్ లెటర్ | Zuckerberg's Letter to daughter | Sakshi
Sakshi News home page

కూతురికి జుకర్‌బర్గ్ లెటర్

Dec 3 2015 12:46 AM | Updated on Jul 26 2018 5:23 PM

కూతురికి జుకర్‌బర్గ్ లెటర్ - Sakshi

కూతురికి జుకర్‌బర్గ్ లెటర్

నీ జననం మాకు (తల్లిదండ్రులిద్దరు) భవిష్యత్తుపై కొత్త ఆశలు పెంచింది.

డియర్ మాక్స్!
 
నీ జననం మాకు (తల్లిదండ్రులిద్దరు) భవిష్యత్తుపై కొత్త ఆశలు పెంచింది.

మా ఆనందాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావటం లేదు. నీ కొత్త జీవితం చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.

అందరు తల్లిదండ్రుల్లాగానే.. మాకంటే మంచి ప్రపంచంలో నువ్వు బతకాలనేది మా ఆశ.

మేం అనుకున్నట్లుగా జరిగేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం.

నిన్ను అమితంగా ప్రేమిస్తున్నందుకు మాత్రమే కాదు.. వచ్చేతరం పిల్లల గురించి ఆలోచించటం కూడా మా నైతిక బాధ్యత.

వందేళ్లలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎన్నో మందులను తయారుచేశాం.

ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు మందులు కూడా కనుగొన్నాం. మిగిలిన వాటి విషయంలో కీలక పురోగతి సాధించాం.

వచ్చే వందేళ్లలో వ్యాధులను నియంత్రించటం, నయం చేయటంపైనా పైచేయి సాధిస్తాం.

వ్యక్తిగత సామర్థ్యం పెంపు వల్ల సరిహద్దులు చెరిపేసే అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది.

అందరూ సమానమనే భావనతో పుట్టిన ప్రాంతం, పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రపంచంలో అందరికీ అవకాశాలను అందించే వీలుంటుంది.

అందుకే ఈ రెండు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నాం.

ప్రతి రంగంలో తమదైన ఆలోచనలతో పనిచేస్తున్న వారికి ఆర్థికంగా అండగా నిలబడాలనుకుంటున్నాం.

మీ తరం బాగుండాలంటే.. మేం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.

ఈ దిశగా మా పాత్ర కూడా ఉండాలని నేను, మీ అమ్మ నిర్ణయించుకున్నాం.

ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఫేస్‌బుక్‌లోని 99శాతం షేర్లను ఇవ్వాలని నిర్ణయించాం.

ప్రస్తుతం దీని విలువ 45 బిలియన్

డాలర్లు (దాదాపు రూ. 3 లక్షల కోట్లు). ఇది చాలా చిన్న మొత్తమే అని మాకు తెలుసు.

మాతృత్వ, పితృత్వ సెలవులు పూర్తయి కొత్త జీవితంలో సెటిల్ అయ్యాక.. తదుపరి వివరాలను వెల్లడిస్తాం.

తల్లిదండ్రులుగా మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న సమయంలో.. ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో
సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

ఫేస్‌బుక్‌లోని ప్రతి వ్యక్తి ఈ యజ్ఞంలో భాగస్వామే.

మాక్స్! నిన్నెంతగానో ప్రేమిస్తున్నాం. అందుకే.. నీతోపాటు నీ తరంలో ఇతర పిల్లలను కూడా మంచి వాతావరణంలో ఉంచటాన్ని ఓ బాధ్యతగా తీసుకుంటున్నాము.

నీ జీవితంలో కూడా ఇదే ప్రేమ, ఆశ, ఆనందం ఉండాలని ఆశిస్తున్నాం. నిన్ను ఈ ప్రపంచానికి చూపించేందుకు ఇక ఆలస్యం చేయం.
 
ప్రేమతో, మీ అమ్మ, నాన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement