మహాత్మా పూలేకు జగన్ నివాళి | YS Jagan mohan reddy pays homage to Jyotiba phule | Sakshi
Sakshi News home page

మహాత్మా పూలేకు జగన్ నివాళి

Nov 29 2013 3:43 AM | Updated on Jul 25 2018 4:09 PM

మహాత్మా పూలేకు జగన్ నివాళి - Sakshi

మహాత్మా పూలేకు జగన్ నివాళి

వెనుకబడిన తరగతులు, మహిళల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడిన మహాత్మా జ్యోతీ రావ్ పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయం లో ఘనంగా నివాళులర్పించారు.

సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతు లు, మహిళల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడిన మహాత్మా జ్యోతీ రావ్ పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షు డు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయం లో ఘనంగా నివాళులర్పించారు. పూలే చిత్రపటానికి ఆయన పు ష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ బీసీ విభాగం కన్వీనర్ గట్టు రామచంద్రరావు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డితోసహా పలువురు హాజరయ్యారు.
 
 పార్టీ కార్యాలయంలో:
  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా పూలే చిత్రపటానికి పార్టీ నేతలు పలువురు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పి.ఎన్.వి.ప్రసాద్, సీహెచ్ కృష్ణారావు, చల్లా మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ ప్రపుల్లరెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర నేతలు సతీష్‌గౌడ్, దశరథ్‌గౌడ్, సురేష్‌గౌడ్ పాల్గొని పూలేను స్మరించుకున్నారు. గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు దేశం లో ఒక దిశను నిర్దేశించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. మహిళా విద్యకోసం విశేషంగా కృషి చేయడమేగాక తన సతీమణినే తొలి ఉపాధ్యాయినిగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement