breaking news
Mahatma Jyoti Rao Phoole
-
‘ఓవర్సీస్’ విద్యానిధి పథకం దరఖాస్తు గడువు 15 వరకు పొడిగింపు
విదేశాలలో ఉన్నత విద్య (మాస్టర్స్ / డాక్టరేట్) అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాత్మ జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి’ పథకం (ఆగస్టు/సెప్టెంబర్ 2026 - ఫాల్ సెషన్) దరఖాస్తుల గడువును పొడిగించారు. గతంలో చివరి తేదీగా సెప్టెంబరు 30ను పేర్కొన్నారు. అయితే, మరో 15 రోజుల పాటు, అంటే అక్టోబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్ బి. బాల మాయాదేవి తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అర్హతలు* కుటుంబ వార్షిక ఆదాయం: అన్ని మార్గాల ద్వారా కలిపి రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉండాలి.* వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే సమయానికి 35 సంవత్సరాలు మించరాదు.పరీక్షలలో కనీస అర్హత మార్కులు:* డిగ్రీ (Graduation): కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.* GRE / G-MAT: GRE లో కనీసం 260 మార్కులు లేదా G-MAT లో 500 మార్కులు సాధించాలి.* ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష: TOEFLలో 60 మార్కులు లేదా IELTSలో 6.0 బ్యాండ్ లేదా PTEలో 50 మార్కులు పొంది ఉండాలి.రిజిస్ట్రేషన్, పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ http://www.telanganaepass.cgg.gov.in ను చూడొచ్చు. -
మహాత్మా పూలేకు జగన్ నివాళి
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతు లు, మహిళల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడిన మహాత్మా జ్యోతీ రావ్ పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు వైఎస్సార్సీపీ అధ్యక్షు డు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయం లో ఘనంగా నివాళులర్పించారు. పూలే చిత్రపటానికి ఆయన పు ష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ బీసీ విభాగం కన్వీనర్ గట్టు రామచంద్రరావు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డితోసహా పలువురు హాజరయ్యారు. పార్టీ కార్యాలయంలో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా పూలే చిత్రపటానికి పార్టీ నేతలు పలువురు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పి.ఎన్.వి.ప్రసాద్, సీహెచ్ కృష్ణారావు, చల్లా మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ ప్రపుల్లరెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర నేతలు సతీష్‌గౌడ్, దశరథ్‌గౌడ్, సురేష్‌గౌడ్ పాల్గొని పూలేను స్మరించుకున్నారు. గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు దేశం లో ఒక దిశను నిర్దేశించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. మహిళా విద్యకోసం విశేషంగా కృషి చేయడమేగాక తన సతీమణినే తొలి ఉపాధ్యాయినిగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన చెప్పారు.


