కళ్లు మూసుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం: ఎర్రబెల్లి | Yerrabelli Dayakararao fires on trs govt | Sakshi
Sakshi News home page

కళ్లు మూసుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం: ఎర్రబెల్లి

Aug 15 2015 2:21 AM | Updated on Aug 27 2018 8:19 PM

కళ్లు మూసుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం: ఎర్రబెల్లి - Sakshi

కళ్లు మూసుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం: ఎర్రబెల్లి

కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుతోందని, తెలంగాణ పట్ల ఇది మరో బాబ్లీ కానుందని టీటీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుతోందని, తెలంగాణ పట్ల ఇది మరో బాబ్లీ కానుందని టీటీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు మరో 5 మీటర్లు పెరిగిందంటే చాలు, కృష్ణా నదిలో చుక్క నీరు తెలంగాణకు అందందని, ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని పేర్కొన్నారు. టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

ఇంత జరుగుతున్నా  ప్రభుత్వ పెద్దలు కళ్లు మూసుకున్నారని విమర్శించారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్ నేతలు నోరు కూడా మెదపడం లేదని ఆరోపించారు. దీనిపై త్వరలోనే ప్రధానిని కలుస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement