
షియోమి నుంచి స్మార్ట్ టూత్ బ్రష్
చౌక ధరల్లో మొబైల్ ఫోన్ల ఆవిష్కరణలో బాగా ప్రాచుర్యం పొందిన చైనా ఎలక్ట్రిక్ దిగ్గజం షియోమి తన స్మార్ట్ ప్రపంచాన్ని వివిధ ఉత్పత్తులకు విస్తరిస్తోంది.
చౌక ధరల్లో మొబైల్ ఫోన్ల ఆవిష్కరణలో బాగా ప్రాచుర్యం పొందిన చైనా ఎలక్ట్రిక్ దిగ్గజం షియోమి తన స్మార్ట్ ప్రపంచాన్ని వివిధ ఉత్పత్తులకు విస్తరిస్తోంది. తాజాగా స్మార్ట్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ను లాంచ్ చేసింది. చైనీస్ స్టార్టప్ సోకేర్ క్యాసెల్స్ భాగస్వామ్యంతో 35డాలర్లకు(రూ.2,350) "సోకేర్ ఎక్స్ 3" పేరుతో స్మార్ట్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బ్లూటూత్ సహాయంతో ఈ బ్రష్ ను స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకుని కంట్రోల్ చేసుకొనే వెసులుబాటును షియోమి కల్పించింది.
వైర్ లెస్ సపోర్టుతో ఈ టూత్ బ్రష్ కు చార్జింగ్ పెట్టుకోవచ్చు. 1000ఏంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ టూత్ బ్రష్ కు ఒక్కసారి చార్జింగ్ చేస్తే, 25 రోజులు వాడుకోవచ్చని కంపెనీ వెల్లడించింది..టూత్ బ్రష్ బ్యాటరీ లైఫ్ ను డిస్ ప్లే చేయడానికి ప్రత్యేకంగా ఓ యాప్ కూడా ఉండనుంది. చాలా సెన్సిటివ్ గా, పళ్లను లోతుగా శుభ్రపరచడానికి ఇది ఉపయోగపడుతుందని గిజ్మో చైనా రిపోర్టు పేర్కొంది.
ఐపీఎక్స్7 సర్టిఫైడ్ తో వాటర్ ఫ్రూప్ ను ఇది కలిగి ఉంది. షియోమి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాంపై దీన్ని కంపెనీ ఆవిష్కరించింది. ఆగస్టు నుంచి దీని షిప్పింగ్ ప్రారంభమవుతుంది. గత వారమే షియోమి, పోర్టబుల్ మస్కిటో రిపీలెంట్ డివైజ్ ను రూ.270లకు లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇది చైనాలో అందుబాటులో ఉంది.