'నా భార్యకు స్వైన్ఫ్లూ.. దారి ఇవ్వండి ప్లీజ్' | Woman traffic cop manhandled in Thane | Sakshi
Sakshi News home page

'నా భార్యకు స్వైన్ఫ్లూ.. దారి ఇవ్వండి ప్లీజ్'

Sep 6 2015 5:48 PM | Updated on Sep 3 2017 8:52 AM

'నా భార్యకు స్వైన్ఫ్లూ.. దారి ఇవ్వండి ప్లీజ్' అంటూ ఓ వ్యక్తి థానేలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గట్టిగా అరిచాడు. ఎవ్వరూ పట్టించుకోలేదు. కోపంతో ఊగిపోయాడు.

థానే: 'నా భార్యకు స్వైన్ఫ్లూ.. దారి ఇవ్వండి ప్లీజ్' అంటూ ఓ వ్యక్తి థానేలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గట్టిగా అరిచాడు. ఎవ్వరూ పట్టించుకోలేదు. కోపంతో ఊగిపోయాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ మహిళా ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్పై దాడి చేశాడు. ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో అలసటత్వం ప్రదర్శించిందనే కారణంతో చేయిచేసుకున్నాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు.

ఓ అంబులెన్స్లో తన భార్యను ఆస్పత్రికి తీసుకెళుతున్న వ్యక్తి(పేరు ఇంకా తెలియరాలేదు) ట్రాఫిక్ సిగ్నల్ వద్ద భారీ మొత్తంలో వాహనాలు ఉండటం చూశాడు. అంబులెన్స్ సైరన్ ఇస్తున్నా అవి పక్కకు తప్పుకోలేదు. పైగా అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ వారికి సహకరించలేదు. తన భార్య స్వైన్ఫ్లూ అని, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు దారిచ్చేలా చూడాలని ప్రాధేయపడ్డాడు. కానీ పరిస్థితి అక్కడ అంతగా అనుకూలంగా ఉండటకపోవడంతో ఆగ్రహానికి లోనైనా ఆ వ్యక్తిని ఆమెపై చేయిచేసుకున్నాడట.

Advertisement
 
Advertisement
Advertisement