breaking news
Woman traffic cop
-
బండి వెనకాల పరిగెత్తి ఫైన్ విధించింది
-
రూల్స్ బ్రేక్ చేసింది.. తర్వాత
గాంధీనగర్ : ఎక్కడైనా సరే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఏం చేస్తారు.. మహా అయితే ఆ వాహనాల నంబర్ నోట్ చేసుకోవడం, ఫోటో తీయడం వంటివి చేస్తారు. తర్వాత ఆ నంబర్ మీద రిజిష్టర్ చేయించుకున్న వ్యక్తికి చలాన్ రాస్తారు. లేదంటే అక్కడే బండి ఆపి ఫైన్ కట్టించుకుంటారు, అంతే తప్ప వాహనం వెనకాల అయితే పరిగెత్తరు కదా. కానీ గుజరాత్, రాజ్‌కోట్‌కు చెందిన ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం ఇందుకు మినహాయింపు. ట్రాఫిక్ నియమాలను పాటించని ఓ మహిళ స్కూటరిస్ట్ వెనకాల పరిగెత్తి మరీ స్కూటీని ఆపి ఫైన్ విధించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. వీడియోలో ఉన్న దాని ప్రకారం స్కూటీ మీద వెళ్తున్న మహిళ ట్రాఫిక్ నియమాలను అతిక్రమించింది. దాంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ మహిళ బండి పక్కకు ఆపి, లైసెన్స్ చూపించమంది. అయితే అక్కడ బాగా రద్దీగా ఉండటంతో సదరు మహిళ, కానిస్టేబుల్ దృష్టి మరలగానే తప్పించుకుపోయే ప్రయత్నం చేసింది. కానీ వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్, మహిళ స్కూటీ రేర్ హ్యాండిల్‌ను పట్టుకుని స్కూటీ వెనకే పరిగెత్తింది. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత మహిళ స్కూటీని ఆపి కానిస్టేబుల్ని తిట్టడం ప్రారంభించింది. అయితే ఆ మహిళ బండి ఆపగానే అధికారి వెళ్లి స్కూటీ తాళం తీసుకుంది మరోసారి పారిపోయే అవకాశం ఇవ్వకుండా. అనంతరం ఆ మహిళను చలనా చెల్లించి బండి తీసుకెళ్లమని హెచ్చరించింది. ఈ మొత్తం తతంగాన్ని ప్రముఖ హిందీ న్యూస్ చానెల్ జీ న్యూస్‌లో ప్రసారం చేశారు. (వీడియో జీ న్యూస్ సౌజన్యంతో) -
'నా భార్యకు స్వైన్‌ఫ్లూ.. దారి ఇవ్వండి ప్లీజ్'
థానే: 'నా భార్యకు స్వైన్‌ఫ్లూ.. దారి ఇవ్వండి ప్లీజ్' అంటూ ఓ వ్యక్తి థానేలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గట్టిగా అరిచాడు. ఎవ్వరూ పట్టించుకోలేదు. కోపంతో ఊగిపోయాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ మహిళా ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో అలసటత్వం ప్రదర్శించిందనే కారణంతో చేయిచేసుకున్నాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. ఓ అంబులెన్స్‌లో తన భార్యను ఆస్పత్రికి తీసుకెళుతున్న వ్యక్తి(పేరు ఇంకా తెలియరాలేదు) ట్రాఫిక్ సిగ్నల్ వద్ద భారీ మొత్తంలో వాహనాలు ఉండటం చూశాడు. అంబులెన్స్ సైరన్ ఇస్తున్నా అవి పక్కకు తప్పుకోలేదు. పైగా అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ వారికి సహకరించలేదు. తన భార్య స్వైన్‌ఫ్లూ అని, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు దారిచ్చేలా చూడాలని ప్రాధేయపడ్డాడు. కానీ పరిస్థితి అక్కడ అంతగా అనుకూలంగా ఉండటకపోవడంతో ఆగ్రహానికి లోనైనా ఆ వ్యక్తిని ఆమెపై చేయిచేసుకున్నాడట.