అక్రమ సంబంధంతో భార్యను హతమార్చిన పోలీసు | Woman burnt alive for opposing husband's affair | Sakshi
Sakshi News home page

అక్రమ సంబంధంతో భార్యను హతమార్చిన పోలీసు

May 30 2015 6:17 PM | Updated on Sep 3 2017 2:57 AM

వదినతో తన వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిందన్న కోపంతో.. కట్టుకున్న భార్యను సజీవదహనం చేశాడో పోలీసు భర్త.

వదినతో తన వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిందన్న కోపంతో.. కట్టుకున్న భార్యను సజీవదహనం చేశాడో పోలీసు భర్త. ఈ ఘటన బీహార్లోని నలంద జిల్లాలో జరిగింది. మృతురాలి సోదరుడు సింకు కుమార్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరికి బీహార్ స్పెషల్ టాస్క్ఫోర్స్లో పనిచేసే మహేష్ యాదవ్ను ఇచ్చి 2009లో పెళ్లి చేశామని చెప్పాడు.

 

అయితే.. అతడికి తన వదినతో వివాహేతర సంబంధం ఉందని తెలిసి తన సోదరి అందుకు అభ్యంతరం తెలిపిందని సింకు కుమార్ పోలీసులకు చెప్పారు. ఆమెను అతడు తరచు చిత్రహింసలు పెట్టేవాడని, చివరకు ఏకంగా సజీవ దహనం చేసేశాడని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఆరుగురి పేర్లను పేర్కొనగా, అందరూ పరారీలో ఉన్నారు. వారిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement