నిండు గర్భిణీని కాళ్లతో తన్నిన భర్త | Husband Beating His Pregnant Wife In Visakhapatnam | Sakshi
Sakshi News home page

నిండు గర్భిణీని కాళ్లతో తన్నిన భర్త

Apr 16 2019 7:27 PM | Updated on Apr 16 2019 7:38 PM

Husband Beating His Pregnant Wife In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : పెందుర్తి మండలంలో దారుణం చోటుచేసుకుంది. నిండు గర్భిణీ అని చూడకుండా ఆమె భర్త, అత్తలు చిత్రహింసలు పెట్టారు. ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పి.. మార్గమధ్యలో తనను కడుపు మీద కాళ్లతో తన్నారని కన్నీటిపర్యంతమైంది. అంతేకాకుండా వారిద్దరు చున్నీతో గొంతు నులిమేశారని వాపోయింది. 

పాతిక లక్షలు తీసుకువస్తేనే.. పిల్లలను కనమని అంటున్నారని బాధితురాలు ఆరోపించింది. ఏడాదిన్నర కాపురంలోనే మూడుసార్లు అబార్షన్‌ చేయించారని తెలిపింది. తన భర్తకు పెళ్లికి ముందే మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని పేర్కొంది. కడుపునొప్పి తీవ్ర కావడంతో సోదరుడి సాయంతో కేజీహెచ్‌కు తరలించినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement