మన దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. అప్పుడే మన కంటే అమెరికాకు ఎక్కువ తొందరగా ఉన్నట్లు కనిపిస్తోంది.
మన దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. అప్పుడే మన కంటే అమెరికాకు ఎక్కువ తొందరగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారత దేవంలో ఎవరు అధికారంలోకి వచ్చినా సరే, వాళ్లతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధికార యంత్రాంగం ప్రకటించింది.
అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖకు గానీ, అమెరికా ప్రభుత్వానికి గానీ పక్షపాతం ఏమాత్రం లేదని, ఎవరు విజేతలైతే వాళ్లతోనే కలిసి పనిచేస్తాం తప్ప.. ఈసారి ఎవరు విజేతలు కావాలన్న విషయాన్ని తాము పట్టించుకోబోమని చెప్పింది. ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే, వాళ్లతో కలిసి తాము పనిచేస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారీ హార్ఫ్ తెలిపారు.