'ఇది రేస్ కాదు.. మారథాన్' | Will Make Agitation National, Says Hardik Patel, Face of Patel Quota Stir | Sakshi
Sakshi News home page

'ఇది రేస్ కాదు.. మారథాన్'

Aug 30 2015 3:38 PM | Updated on Aug 21 2018 2:30 PM

'ఇది రేస్ కాదు.. మారథాన్' - Sakshi

'ఇది రేస్ కాదు.. మారథాన్'

తన ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా మారుస్తానని గుజారాత్ యువకెరటం, పటేళ్లను ఓబీసీల్లో చేర్చాలని గత కొద్ది రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న హార్దిక్ పటేల్ హెచ్చరించారు.

న్యూఢిల్లీ: తన ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా మారుస్తానని గుజారాత్ యువకెరటం, పటేళ్లను ఓబీసీల్లో చేర్చాలని గత కొద్ది రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న హార్దిక్ పటేల్ హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమంలో మొత్తం తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారని, వారికి 48 గంటల్లోగా నష్టపరిహారం ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇక సూరత్ నుంచి ఒక ప్రకటన వెలువరుస్తానని హెచ్చరించారు. అవసరం అయితే, తన ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళతానని, జంతర్ మంతర్ వద్ద లక్నోలో కూడా నిరసనలు చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఇది 100 మీటర్ల రేస్ కాదని, మారథాన్ అని అన్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న హార్దిక్ పటేల్ ఇతర వర్గాల్లో కూడా రిజర్వేషన్లు డిమాండ్ చేసే నేతలతో గుజ్జర్లు, జాట్లు తదితరులతో మాట్లాడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ సమస్యను తేలిగ్గా చూస్తున్నారని, అదే ఒక ఉగ్రవాది సమస్య అయితే, అర్థరాత్రి అయినా సుప్రీంకోర్టు అయినా అర్థరాత్రి తలుపులు తెరవరా, కావాల్సిన పనులు చేయరా అంటూ నిలదీశారు. దేశంలో 85శాతంమంది పేదవారే ఉన్నారని వారందరికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో ఉద్యమం తనకు బాధకలిగించిందని ప్రధాని మోదీ అనడం పట్ల స్పందిస్తూ గాంధీ, సర్దార్ పటేల్ వంటి మహనీయులుపుట్టిన నేలపై ఏం జరిగినా దేశానికి దిగ్భ్రాంతిని కలిగిస్తుందని బాధ కలిగిస్తుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement