చాటింగ్ వద్దన్నాడని.. వేళ్లు కోసేసింది! | wife chopps off husband's fingers for asking to stop chatting | Sakshi
Sakshi News home page

చాటింగ్ వద్దన్నాడని.. వేళ్లు కోసేసింది!

May 17 2016 11:31 AM | Updated on Sep 4 2017 12:14 AM

చాటింగ్ వద్దన్నాడని.. వేళ్లు కోసేసింది!

చాటింగ్ వద్దన్నాడని.. వేళ్లు కోసేసింది!

అస్తమానూ చాటింగ్ చేయొద్దని చెప్పినందుకు ఓ భార్య.. తన భర్త వేళ్లను చాకుతో కోసి పారేసింది.

ఇటీవలి కాలంలో వాళ్లు, వీళ్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్లూ సెల్‌ఫోన్ చాటింగ్‌కు బానిసలు అయిపోతున్నారు. ఇలా అస్తమానూ చాటింగ్ చేయొద్దని చెప్పినందుకు ఓ భార్య.. తన భర్త వేళ్లను చాకుతో కోసి పారేసింది. సునీతా సింగ్ బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త చంద్రకాంత్ సింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమె ఎప్పుడు చూసినా సెల్‌ఫోన్ పట్టుకుని స్నేహితులతో చాటింగ్ చేస్తూనే ఉండేది. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య చాలాసార్లు గొడవలయ్యాయి. ఎన్ని సార్లు చెప్పినా ఆమె ఆ పని మాత్రం మానుకోలేదు.

ఒకసారి ఎందుకో అనుమానం వచ్చిన చంద్రకాంత్.. ఆమె ఫోన్ తీసి చూశాడు. అంతే, ఒక్కసారిగా షాకయ్యాడు. చాలా ఫోన్లలో డియర్, డార్లింగ్ అంటూ అవతలి వైపు నుంచి మెసేజిలు ఉన్నాయి. దాంతో ఇద్దరి మధ్య మళ్లీ గొడవైంది. ఆ సమయానికి ఆమె కిచెన్‌లో వంట చేస్తోంది. భర్త తన ఫోన్ తీసి చూడటంతో.. ఆవేశానికి గురైన ఆమె, కిచెన్‌లో చాకు తీసుకుని అతడి మూడు వేళ్లు కోసిపారేసింది. దాంతో లబోదిబోమంటూ అతడు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు. తన భార్యపై గృహహింస చట్టం కింద కేసు పెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement