వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల మాజీ సైనికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల మాజీ సైనికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని మాజీ సైనికులు తెలిపారు.
ఓఆర్ఓపీ డిమాండ్లపై కేవలం ఒక్కదాన్నే ప్రభుత్వం ఆమోదించిందని మాజీ సైనిక ఉద్యోగులు చెప్పారు. తాము చేసిన ఆరు డిమాండ్లను కేంద్రం తిరస్కరించిందని చెప్పారు. ఓఆర్ఓపీ విధానంపై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శనివారం మధ్యాహ్నం ప్రకటన చేశారు. కాగా ప్రభుత్వ ప్రకటనపై తాము పూర్తిగా సంతృప్తి చెందలేని, నిరసన కొనసాగిస్తామని మాజీ సైనికులు చెప్పారు.