ముడిఇనుము తరలింపునకు అనుమతించలేం: సీబీఐ కోర్టు | We can not give permission to shift Raw Iron ore: CBI Court | Sakshi
Sakshi News home page

ముడిఇనుము తరలింపునకు అనుమతించలేం: సీబీఐ కోర్టు

Sep 4 2013 3:51 AM | Updated on Sep 1 2017 10:24 PM

ఓబులాపురంలోని తమ స్టాక్‌యార్డులో బళ్లారి ఐరన్‌ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (బీఐఓపీ)కి చెందిన ముడిఇనుమును సమీపంలోని

ఓబులాపురంలోని తమ స్టాక్‌యార్డులో బళ్లారి ఐరన్‌ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (బీఐఓపీ)కి చెందిన ముడిఇనుమును సమీపంలోని మరో ప్రాంతానికి తరలించేందుకు అనుమతించలేమని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ముడిఇనుమును మరో ప్రాంతానికి తరలించేందుకు అనుమతిస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని, ఈ వ్యవహారంలో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం ఉందని తేల్చిచెప్పింది. ఈ ఖనిజ పరిమాణం, నాణ్యతను సీబీఐ ఇప్పటికే నిర్ధారించిందని, ఈ అంశాలు దర్యాప్తులో కీలకమని పేర్కొంది. ఈ మేరకు బీఐఓపీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టివేస్తూ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు మంగళవారం తీర్పు వెలువరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement