వాట్సాప్ చాట్..ఇక గూగుల్ డ్రైవ్‌లో | watsapp chat and Google drive | Sakshi
Sakshi News home page

వాట్సాప్ చాట్..ఇక గూగుల్ డ్రైవ్‌లో

Oct 12 2015 2:50 AM | Updated on Jul 27 2018 1:11 PM

వాట్సాప్ చాట్..ఇక గూగుల్ డ్రైవ్‌లో - Sakshi

వాట్సాప్ చాట్..ఇక గూగుల్ డ్రైవ్‌లో

ఎలాంటి మొబైల్ అప్లికేషన్‌కు అయినా ఏదో ఒక అవరోధం ఉంటుంది. అదే మాదిరిగా వాట్సాప్‌కు కూడా ఒక అడ్డంకి ఉంది.

న్యూఢిల్లీ: ఎలాంటి మొబైల్ అప్లికేషన్‌కు అయినా ఏదో ఒక అవరోధం ఉంటుంది. అదే మాదిరిగా వాట్సాప్‌కు కూడా ఒక అడ్డంకి ఉంది. ఇప్పటివరకు వాట్సాప్‌లో వచ్చిన వీడియోలు, సంక్షిప్త సమాచారం, ఫొటోలతో స్మార్ట్‌ఫోన్ మెమరీ నిండిపోతే వాటిని అయిష్టంగా తొలగించాల్సిన పరిస్థితి ఉంది. కానీ, ఇప్పటినుంచి వాట్సాప్ వినియోగదారులకు ఈ తిప్పలు తప్పనున్నాయి. వాట్సాప్ కంటెంట్‌కు గూగుల్ డ్రైవ్ త్వరలో బ్యాక్ అప్ సౌకర్యాన్ని కల్పించనుంది.

అతి కొద్ది నెలల్లోనే మీ వాట్సాప్ చాట్ హిస్టరీ, మల్టీమీడియా కంటెంట్‌ను డ్రైవ్‌లో బ్యాక్‌అప్ చేసుకోవచ్చని గూగుల్ డ్రైవ్  డెరైక్టర్ స్కాట్ జాన్సస్టన్ తన బ్లాగ్‌లో చెప్పారు. కానీ ఈ అవకాశం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే గూగుల్ అందిస్తుందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement