'రిపోర్టు మార్చమని ఒత్తిడి తెచ్చారు' | Was asked to give false report in Sunanda Pushkar death case, AIIMS doctor says | Sakshi
Sakshi News home page

'రిపోర్టు మార్చమని ఒత్తిడి తెచ్చారు'

Jan 6 2015 3:24 PM | Updated on Aug 16 2018 4:07 PM

'రిపోర్టు మార్చమని ఒత్తిడి తెచ్చారు' - Sakshi

'రిపోర్టు మార్చమని ఒత్తిడి తెచ్చారు'

కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం జరిగిందన్న వాదనలు విన్పిస్తున్నాయి.

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం జరిగిందన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా పోస్టుమార్టం నివేదిక మార్చాలని ఎయిమ్స్ లోని ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తాపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. సునంద మృతిని సహజ మరణంగా పేర్కొనాలని ఉన్నతస్థాయిలో తనపై ఒత్తడి తెచ్చారని విజిలెన్స్ కమిషన్ అధిపతికి గుప్తా లేఖ రాసినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

తాను లొంగకపోవడంతో తనను లక్ష్యంగా చేసుకున్నారని వాపోయారు. తన స్థానంలో వేరొకరిని ఫోరెన్సిక్ విభాగం అధిపతిగా నియమించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు 'క్యాట్' కూడా లేఖ రాశారు. విషం కారణంగానే సునంద మరణించినట్టు గుప్తా తన నివేదికలో పేర్కొన్నారు. ఆమెది హత్యేనని నిర్ధారణయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement