చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర చమురుశాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు.
చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర చమురుశాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. అయితే ఎప్పుడు, ఎంత తగ్గుతాయన్న విషయం మాత్రం ఆయన చెప్పలేదు. సామాన్యుడికి ఊరట తప్పనిసరిగా ఉంటుంది గానీ, అది ఎప్పుడు.. ఎంత అని మాత్రం అడగొద్దని మొయిలీ విలేకరులతో అన్నారు. ఎప్పుడో చెబితే ప్రజలు నిల్వ చేసుకుంటారని అన్నారు.
మరో రెండు నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు మొయిలీ ప్రకటన పెద్ద ఊరటగానే మిగలనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో ఈ ఊరట లభించేలా ఉంది. ఇరాక్, వెనిజులా లాంటి దేశాల నుంచి కూడా ముడి చమురు కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ధరలు తగ్గుతున్నట్లు మొయిలీ చెప్పారు.