రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
బొబ్బిలి(విజయనగరం): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని గ్రోత్ సెంటర్‌లో ద్విచక్రవాహనం పై వెళుతున్న వ్యక్తిని పాల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడిది మండలంలోని కాచంద్ర వలసగా స్థానికులు గుర్తించారు.