పెళ్లికొడుకు తాగొచ్చాడు.. పెళ్లాగిపోయింది | up: Groom turns up drunk for wedding, girl calls off the wedding | Sakshi
Sakshi News home page

పెళ్లికొడుకు తాగొచ్చాడు.. పెళ్లాగిపోయింది

Apr 30 2015 12:53 PM | Updated on Sep 3 2017 1:10 AM

పెళ్లికొడుకు తాగొచ్చాడు.. పెళ్లాగిపోయింది

పెళ్లికొడుకు తాగొచ్చాడు.. పెళ్లాగిపోయింది

కాబోయే భర్త తాగొచ్చి నానా రచ్చ చేసినందుకు ఓ యువతి అతడితో తన పెళ్లిని రద్దు చేసుకుంది.

మహోబా: కాబోయే భర్త తాగొచ్చి నానా రచ్చ చేసినందుకు ఓ యువతి అతడితో తన పెళ్లిని రద్దు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలోని అజ్నార్ అనే గ్రామంలో దేవకీ అనే అమ్మాయికి అరవింద్ అనే అబ్బాయికి వివాహం కుదిరింది. మంగళవారం వారి వివాహం ఓ కళ్యాణమండపంలో జరగాల్సి ఉండగా అదే రోజు అతడు ఫుల్లుగా తాగేసి వచ్చాడు. అంతటితో ఆగకుండా అమ్మాయి తరుపువారందరితో గొడవకు దిగాడు. సోదరులు, బంధువులపై దాడి చేశాడు.

ఈ తతంగానికి వరుడి తల్లిదండ్రులు కూడా తోడవడంతో అవమానం భరించలేక దేవకీ తనకు ఈ పెళ్లి అవసరం లేదని కళ్యాణమండపం నుంచి తమ వారిని తీసుకొని వెళ్లిపోయింది. అనంతరం పెళ్లికొడుకు తరుపువారు కూడా ఇక చేసేదేమి లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై వధువును, వరుడిని సంప్రదించగా.. అరవింద్ ఎందుకు అలా చేశాడో తనకు తెలియదని దేవకీ చెప్పగా.. పెళ్లి ఎందుకు ఆగిపోయిందో తనకు తెలియదని అరవింద్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement