మణిపూర్ సీఎం నివాసం వద్ద బాంబు పేలుడు | Two killed, seven injured in bomb blast near Manipur CM's residence | Sakshi
Sakshi News home page

మణిపూర్ సీఎం నివాసం వద్ద బాంబు పేలుడు

Oct 30 2013 9:08 AM | Updated on Aug 25 2018 5:41 PM

మణిపూర్ రాజధాని ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ అధికార నివాసం వద్ద ఈ రోజు తెల్లవారుజామున బాంబు పేలుడు సంభవించింది.

మణిపూర్ రాజధాని ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ అధికార నివాసం వద్ద ఈ రోజు తెల్లవారుజామున బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. సీఎం భద్రత సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను ఇంఫాల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

పోలీసులు,భద్రత సిబ్బంది అప్రమత్తమైయ్యారు. అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. అయితే నిన్న కూడా సీఎం ఇబోబి సింగ్ నివాసానికి కూతవేటు దూరంలో బాంబు పేలుడు సంభవించింది. అలాగే ఈ ఏడాది ఆగస్టులో కూడా సీఎం నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడు జరిగింది. ఆ రెండు ఘటనలో ఎవరు గాయపడలేదు.

Advertisement
 
Advertisement
Advertisement