సముద్రంలోకి వెళ్లి టైటానిక్‌ను చూడొచ్చు! | Travel company to begin trips to Titanic wreckage | Sakshi
Sakshi News home page

సముద్రంలోకి వెళ్లి టైటానిక్‌ను చూడొచ్చు!

Mar 28 2017 3:21 AM | Updated on Sep 5 2017 7:14 AM

సముద్రంలోకి వెళ్లి టైటానిక్‌ను చూడొచ్చు!

సముద్రంలోకి వెళ్లి టైటానిక్‌ను చూడొచ్చు!

వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్‌ ఓడను సముద్రగర్భంలోకి వెళ్లి సందర్శించడానికి

లండన్‌: వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్‌ ఓడను సముద్రగర్భంలోకి వెళ్లి సందర్శించడానికి ఓ కంపెనీ పర్యాటకులకు అవకాశం కల్పించనుంది. ఈ సాహసయాత్రకు ఒక్కో వ్యక్తికి టికెట్‌ ధర 1,05,129 డాలర్లు (రూ.68 లక్షలు). వచ్చే ఏడాది మే నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర తొలిదశకు ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. 8 రోజులు సాగే ప్రయాణం కెనడా నుంచి మొదలవుతుంది.

‘బ్లూ మార్బుల్‌ ప్రైవేట్‌’ అనే సంస్థ పర్యాటకులను అట్లాంటిక్‌ మహాసముద్రంలో 4 వేల మీటర్ల లోతున ఉన్న టైటానిక్‌ ఓడ వద్దకు పర్యాట కులను తీసుకెళ్లనుంది. 1912 ఏప్రిల్‌ 14న ఆర్‌ఎంఎస్‌–టైటానిక్‌ ఓడ ఇంగ్లండ్‌ నుంచి అమెరికా వెళ్తూ తన తొలి ప్రయాణంలోనే మునిగిపోవడం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement