టుడే అప్డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్డేట్స్

Nov 2 2016 6:33 AM | Updated on Sep 4 2017 6:59 PM

అమరావతి నిర్మాణంపై ఎన్జీటీలో నేడూ కొనసాగనున్న వాదనలు

♦ ఢిల్లీ: అమరావతి ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఎన్జీటీలో వాదనలు నేడూ కొనసాగనున్నాయి.

♦ చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్రెడ్డి బుధవారం చంద్రగిరికి రానున్నారు. వైఎస్‌ఎంఆర్‌ కల్యాణ మండపంలో జరిగే బంధువుల వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులు శుభకర్‌రెడ్డి, నళినీరెడ్డిలను ఆశీర్వదించనున్నారు.

♦ హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఇవాళ మంత్రి హరీష్ రావు సమీక్ష
  భూ సేకరణ, పనుల పురోగతిపై సమీక్షించనున్న హరీష్ రావు

♦ మల్కన్ గిరి ఎన్కౌంటర్పై నేడు ఢిల్లీలో ప్రజాసంఘాల నిరసన
 జంతర్ మంతర్ వద్ద  ధర్నా నిర్వహించనున్న ప్రజాసంఘాలు

♦ హైదరాబాద్: నేటి నుంచి రెండ్రోజులపాటు ఇక్రిశాట్లో అంతర్జాతీయ సదస్సు
   వాతావరణ మార్పులు, నీరు, వ్యవసాయం, ఆహార భద్రత పై సదస్సు
   పాల్గొననున్న ప్రపంచ ప్రఖ్యాత పరిశోధన సంస్థల ప్రతినిధులు

♦ హైదరాబాద్: టీఆర్ఎస్ జిల్లా కమిటీలపై నేడు తుది కసరత్తు

♦ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు నేపాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన

♦ గంభీర్ ఉంటాడా?... ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు భారత్ క్రికెట్ జట్టు ఎంపిక నేడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement