ముందస్తు పన్ను చెల్లింపులకు వీలుగా ఆదివారం కూడా కొన్ని బ్యాంకు శాఖలు పనిచేయనున్నాయి.
న్యూఢిల్లీ: ముందస్తు పన్ను చెల్లింపులకు వీలుగా ఆదివారం కూడా కొన్ని బ్యాంకు శాఖలు పనిచేయనున్నాయి. ముందస్తు పన్నులు స్వీకరించే శాఖలను సెప్టెంబర్ 14, 15న పనిచేసే విధంగా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంకులను ఆదేశించింది.
ఒకవేళ ఈ రెండు రోజుల్లో చెల్లింపులు జరపడంలో విఫలమైతే సోమవారం(సెప్టెంబర్ 16) చెల్లింపులు జరపవచ్చని ఆర్థిక శాఖ పేర్కొంది. మూడు నెలలకు ఒకసారి ముందస్తు పన్ను చెల్లింపుల్లో (అడ్వాన్స్ ట్యాక్స్) భాగంగా సెప్టెంబర్ 15 లోగా వీటిని చెల్లించాలి.