బీసీ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలి | TO announce BC Industrial Policy? | Sakshi
Sakshi News home page

బీసీ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలి

Sep 8 2015 1:36 AM | Updated on Sep 3 2017 8:56 AM

బీసీ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలి

బీసీ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలి

జనాభాలో 52శాతం ఉన్న వెనుకబడిన తరగతులవారు పారిశ్రామికరంగంలో 5 శాతం కూడా లేకపోవడం విచారకరమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆవేద న వ్యక్తం చేశారు.

పది జిల్లాల పారిశ్రామికవేత్తల సమ్మేళనంలో ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: జనాభాలో 52శాతం ఉన్న వెనుకబడిన తరగతులవారు పారిశ్రామికరంగంలో 5 శాతం కూడా లేకపోవడం విచారకరమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆవేద న వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్ అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం సెక్రటరీ జనరల్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర బీసీ పారిశ్రామికవేత్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలని కోరారు. యాంత్రికత రాకముందు మానవజాతికి ఉపయోగపడే అన్ని పరిశ్రమలు బీసీ కులాల చేతుల్లోనే ఉండేవని, ఇప్పుడు ఆ పరిశ్రమలన్నీ కార్పొరేట్‌శక్తులు, ఉన్నతకులాల చేతుల్లోకి వెళ్లాయన్నారు. తెలంగాణ  నూతన పారిశ్రామిక విధానంలో బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రెండు వేల ఎకరాల స్థలాన్ని కేటాయించి ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.

బీసీ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఇండస్ట్రియల్ సమాఖ్య చైర్మన్ మర్రి ప్రభాకర్‌రావు, సమన్వయకర్త, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, కో-కన్వీనర్‌లు మన్యం సునీల్‌కుమార్ ముదిరాజ్, కె.గణేశ్‌బాబు, ఎం.లక్ష్మి, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement