ఇది టైగర్ ఫిష్ | tiger fish in uppada | Sakshi
Sakshi News home page

ఇది టైగర్ ఫిష్

Aug 10 2015 3:12 AM | Updated on Sep 3 2017 7:07 AM

ఇది టైగర్ ఫిష్

ఇది టైగర్ ఫిష్

‘టైగర్’ రకం రొయ్యల్ని ప్రత్యేకించి చెరువుల్లో పెంచుతుంటారు. అయితే ఆదివారం తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ వద్ద సముద్రతీరంలో...

‘టైగర్’ రకం రొయ్యల్ని ప్రత్యేకించి చెరువుల్లో పెంచుతుంటారు. అయితే ఆదివారం తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ వద్ద సముద్రతీరంలో ‘టైగర్ ఫిష్’ కనిపించింది. తెరుచుకున్న నోరు, పులిని పోలిన చర్మం, మచ్చలతో ఉన్న ఈ చేప చనిపోయి తీరానికి కొట్టుకు వచ్చింది. దాదాపు  రెండడుగుల పొడవు, 5 కిలోల బరువు ఉన్న ఈ చేప చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నా.. తినడానికి పనికిరాదని మత్స్యకారులు చెప్పారు. సముద్రజలాలు కలుషితం కావడం వల్ల ఇటువంటి చేపలు చనిపోయి ఒడ్డుకు చేరుతున్నాయన్నారు. 
- కొత్తపల్లి

Advertisement
 
Advertisement
Advertisement