చెట్టును ఢీకొన్న స్కార్పియో: ముగ్గురి మృతి | Three killed in road accident, Scorpio hits tree | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న స్కార్పియో: ముగ్గురి మృతి

Aug 27 2015 6:10 AM | Updated on Sep 15 2018 7:55 PM

చెట్టును ఢీకొన్న స్కార్పియో: ముగ్గురి మృతి - Sakshi

చెట్టును ఢీకొన్న స్కార్పియో: ముగ్గురి మృతి

అనంతపురం జిల్లాలోని నల్లచెరువు మండలం దేవరెడ్డి పల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది.

అనంతపురం(నల్లచెరువు): నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున ఓ స్కార్పియో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డవారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తులు రవి(50), మురళి(56), అనిల్(30) అంతా హిందూపూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. రవి అక్కడిక్కడే మృతిచెందగా, మిగతా వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.

Advertisement
 
Advertisement
Advertisement