టెస్కో అమెరికా రిటైల్ స్టోర్స్ దివాళా | Sakshi
Sakshi News home page

టెస్కో అమెరికా రిటైల్ స్టోర్స్ దివాళా

Published Wed, Oct 2 2013 2:02 AM

Tesco seeks sale after putting US grocery chains up for bankruptcy

లండన్: బ్రిటన్‌కు చెందిన టెస్కో కంపెనీ అమెరికాలోని తన గ్రోసరీ స్టోర్స్ చెయిన్ ఫ్రెష్ అండ్ ఈజీకి సంబంధించి దివాళా పిటిషన్ దాఖలు చేసింది. రాన్ బర్కీ నేతృత్వంలోని ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు 167 స్టోర్లను విక్రయించే ప్రణాళికలో భాగంగా టెస్కో కంపెనీ ఈ చర్య తీసుకుందని సమాచారం. 2006లో టెస్కో కంపెనీ అమెరికాలో ఈ గ్రోసరీ స్టోర్స్ చెయిన్‌ను ప్రారంభించింది. అమెరికా రిటైల్ దిగ్గజం, వాల్‌మార్ట్‌కు టెస్కో గట్టి పోటీనిస్తుందని అందరూ భావించారు. కానీ ప్రారంభం నుంచే ఈ చెయిన్‌పై టెస్కో ఎన్నడూ లాభాలు కళ్లజూడలేకపోయింది.  విక్రయం కాని స్టోర్స్‌ను మూసేస్తామని టెస్కో పేర్కొంది.
 

Advertisement
Advertisement