శీతాకాల సమావేశాల్లోనే టీ-బిల్లు? | telangana bill to be tabled in winter session of parliament? | Sakshi
Sakshi News home page

శీతాకాల సమావేశాల్లోనే టీ-బిల్లు?

Nov 29 2013 7:06 PM | Updated on Mar 18 2019 7:55 PM

పరస్పర విరుద్ధ ప్రకటనలతో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అంశాన్ని గందరగోళంలోకి పడేస్తున్నారు. బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారా.. లేదా అనే విషయమై ఏమాత్రం స్పష్టత లేకుండా చేశారు.

పరస్పర విరుద్ధ ప్రకటనలతో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అంశాన్ని గందరగోళంలోకి పడేస్తున్నారు. బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారా.. లేదా అనే విషయమై ఏమాత్రం స్పష్టత లేకుండా చేశారు. ఈ అంశంపై శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. శీతాకాల సమావేశల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడంపైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. బిల్లు సాధ్యాసాధ్యాలపై నాయకులు చర్చించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా కేంద్ర మంత్రి కమల్ నాథ్ హాజరయ్యారు. జీవోఎం నివేదికపై సమూలంగా కోర్ కమిటీలో చర్చించారు.

సమావేశం దాదాపు గంటసేపటి పాటు కొనసాగింది. అయితే, కమల్ నాథ్ మాత్రం మధ్యలోనే సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. ఈ సమయంలో మీడియా ఆయనతో మాట్లాడగా.. ఈ విడత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. అయితే కేంద్రం మాత్రం ఎలాగైనా బిల్లు ప్రవేశపెట్టే యోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన తర్వాత కోర్ కమిటీ సభ్యుడు అహ్మద్ పటేల్ ఈ విషయాన్ని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement