మహిళా జర్నలిస్టు ఉద్యోగానికి రాజీనామా | Tehelka woman journalist, who accused Tarun Tejpal of sexual assault, resigns | Sakshi
Sakshi News home page

మహిళా జర్నలిస్టు ఉద్యోగానికి రాజీనామా

Nov 25 2013 2:20 PM | Updated on Sep 2 2017 12:58 AM

మహిళా జర్నలిస్టు ఉద్యోగానికి రాజీనామా

మహిళా జర్నలిస్టు ఉద్యోగానికి రాజీనామా

లైంగిక వేధింపులకు గురైన మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి సోమవారం రాజీనామా చేసింది.

న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు గురైన మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి సోమవారం రాజీనామా చేసింది. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్‌లో పది రోజుల కిందట తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇక లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న  తరుణ్ తేజ్ పాల్ సోమవారం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్ట్ను తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం ఆయన  ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. తేజ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ జీఎస్ సిస్తానీ ముందు ఆయన తరపు న్యాయవాదులు గీతా లుథ్రా, ప్రమోదు దూబేలు ఉంచారు. తేజ్ పాల్ ముందస్తు పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement