ప్రియునితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి | Teenaged girl, paramour enact fake abduction | Sakshi
Sakshi News home page

ప్రియునితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి

Feb 16 2014 4:40 PM | Updated on Apr 7 2019 4:36 PM

ప్రియునితో కలిసి బ్రతకాలన్ను ఓ యువతి కన్నతల్లి దండ్రులనే మోసగించాలనుకుంది.

కోయంబత్తూర్:  ప్రియునితో కలిసి బ్రతకాలనుకున్న ఓ యువతి కన్నతల్లి దండ్రులనే మోసగించాలనుకుంది. తన ప్రేమించిన అబ్బాయితో పలాయనం చిత్తగించేందుకు ఆమె కిడ్నాప్ డ్రామాకు తెరలేపింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ లో చోటు చేసుకుంది.  దీనిలో భాగంగా రూ. 20 లక్షలు ఇస్తే మీ అమ్మాయిని సురక్షితంగా విడిచిపెడతానని ఆమె ప్రియుడు గత రాత్రి ఫోన్ లో బెదిరింపులకు దిగాడు.  దీంతో కంగారు పడిన అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

ముందుగా ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే  ఆ యువతి  ప్రియునితో కలిసి బైక్ వెళుతుండగా గాంధీపురంకు అత్యంత సమీపంలోని అవరాంపలాయం ప్రాంతంలో పోలీసులకు చిక్కింది. దీనిపై విచారించిన పోలీసులకు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తాను ఇంటర్మిడియట్ చదువుతున్నానని,  ప్రేమించిన అబ్బాయితో కలిసి బ్రతికేందుకు ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్టు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement