అమెరికా పర్యాటకురాలిపై అత్యాచారయత్నం | Taxi driver held for trying to molest American tourist | Sakshi
Sakshi News home page

అమెరికా పర్యాటకురాలిపై అత్యాచారయత్నం

May 13 2014 11:00 AM | Updated on Apr 4 2019 3:21 PM

అమెరికా పర్యాటకురాలిపై అత్యాచారయత్నం - Sakshi

అమెరికా పర్యాటకురాలిపై అత్యాచారయత్నం

భారత్ వచ్చిన అమెరికా పర్యాటకురాలిపై అత్యాచారానికి యత్నించాడో కారు డ్రైవర్, అయితే ఆ మహిళ అతడి బారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

భారత్ వచ్చిన అమెరికా పర్యాటకురాలిపై అత్యాచారానికి యత్నించాడో కారు డ్రైవర్, అయితే ఆ మహిళ అతడి బారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ సమయ్ సింగ్ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... భారత్ పర్యటనలో భాగంగా అమెరికన్ పర్యాటకురాలు ఆదివారం కారులో న్యూఢిల్లీ నుంచి రుషికేశ్కు బయలుదేరింది.

 

ఆ క్రమంలో న్యూఢిల్లీ - డెహ్రడూన్ జాతీయ రహదారిపై భోజనం కోసం కారు ఆపిన డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దాంతో ఆమె డ్రైవర్ను ప్రతిఘటించింది. ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకుని... మరో కారులో రుషికేశ్ చేరుకుని...జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement