భారత్ నియంత్రణలోనే టాటా ఎయిర్‌లైన్స్ | Tata Sons, Singapore Airlines say airline to always remain under Indian control | Sakshi
Sakshi News home page

భారత్ నియంత్రణలోనే టాటా ఎయిర్‌లైన్స్

Sep 25 2013 1:42 AM | Updated on Sep 1 2017 11:00 PM

తాము ప్రారంభించనున్న విమానయాన సంస్థ ఎల్లవేళలా భారత చట్టాల నియంత్రణలోనే పనిచేస్తుందని ఒక సంయుక్త ప్రకటనలో సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్ పేర్కొన్నాయి.

న్యూఢిల్లీ: తాము ప్రారంభించనున్న విమానయాన సంస్థ ఎల్లవేళలా భారత చట్టాల నియంత్రణలోనే పనిచేస్తుందని ఒక సంయుక్త ప్రకటనలో సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్ పేర్కొన్నాయి. ఈ వెంచర్  నిర్వహణ దేశీయ సంస్థ చేతిలోనే ఉంటుందని తెలిపాయి. టాటా ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్‌గా వ్యవహరిస్తున్న ఈ వెంచర్ ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగానూ విమానయాన సేవలను అందించేందుకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు అనుమతించమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న సందర్భంగా దేశీయ నిర్వహణపై టాటా ఎస్‌ఐఏ తాజాగా వివరణ ఇచ్చింది.
 
 ఈ వెంచర్‌లో టాటా సన్స్‌కు 51%, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49% చొప్పున వాటా ఉంటుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఇన్వెస్ట్‌చేయనున్న 4.9 కోట్ల డాలర్లకుగాను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద ఎఫ్‌ఐపీబీ అనుమతిని పొందాల్సి ఉంది. దీంతోపాటు ఈ వెంచర్‌కు డీజీఎఫ్‌టీ, డీజీసీఏ, సీబీఈసీ వంటి  ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించాల్సి ఉంది. అంతేకాకుండా సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అనుమతులు సైతం తప్పనిసరి.

Advertisement
 
Advertisement
Advertisement