సుప్రీం నోటీసులు.. పెద్ద విషయం | Supreme notices to Chandrababu is a big thing, YS Jagan | Sakshi
Sakshi News home page

సుప్రీం నోటీసులు.. పెద్ద విషయం

Mar 7 2017 3:03 AM | Updated on Sep 2 2018 5:43 PM

సుప్రీం నోటీసులు.. పెద్ద విషయం - Sakshi

సుప్రీం నోటీసులు.. పెద్ద విషయం

ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయమని, ఈ విషయం చంద్రబాబుకూ తెలుసు, మనకూ తెలుసని వైఎస్‌ జగన్‌ అన్నారు.

- ఓటుకు కోట్లు కేసుపై జగన్‌ వ్యాఖ్య
- దృష్టి మళ్లించేందుకే బాబు ప్రెస్‌మీట్‌


సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందనే విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉలికిపాటుకు లోనయ్యారని, ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మళ్లిం చేందుకే అసెంబ్లీ ముగిసిన అరగంటకే విలేకరుల సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా మాట్లాడారని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయమని, ఈ విషయం చంద్రబాబుకూ తెలుసు, మనకూ తెలుసన్నారు. విలేకరులు ప్రశ్నించినపుడు అదేదో చాలా తేలికైన విషయం అన్నట్లుగా చంద్రబాబు తోసిపుచ్చారన్నారు. తనపై 26 కేసులు పెట్టారని ఏమీ కాలేదని చంద్రబాబును మీడియా అడిగినపుడు చెప్పారని అయితే ఏ కేసు కూడా విచారణ దశ వరకు వెళ్లలేదనే విషయం మాత్రం చెప్పలేదని జగన్‌ విమర్శించారు. చంద్రబాబు తన చాకచక్యం, పలుకుబడి వినియోగించి చాలా కష్టపడి స్టేలు తెచ్చు కుంటారని జగన్‌ అన్నారు.  తొలిరోజు అసెంబ్లీలో ఉదయం 11.06 గంటలకు ముహూర్తం గవర్నర్‌ చేత ప్రసంగాన్ని ప్రారంభింప జేస్తే 11.10 గంటకు సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిందని, ఇదేమి గ్రహబలమోనని జగన్‌ వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేను కొనుగోలు చేసే యత్నంలో నల్లధనం ఇస్తూ అడ్డంగా దొరికి పోయినా రాజీనామా చేయకుండా ఉన్న ముఖ్యమంత్రి దేశం మొత్తం మీద చంద్రబాబు ఒక్కరేనని జగన్‌ అన్నారు.  ‘రాష్ట్ర ప్రభుత్వం చాలా అసహనంతో వ్యవహరిస్తోంది. వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అక్రమంగా కేసులు పెట్టి వేధింపు చర్యలకు పాల్పడుతోంది. దిద్దుకుంటే ప్రజాస్వామ్యంలో నాయకులవుతారు. కళ్లు నెత్తికెక్కిన వారికి ప్రజాస్వామ్యం కచ్చితంగా పాఠం నేర్పుతుంది’ జగన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement