ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో చెలరేగిన మత ఘర్షణలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో చెలరేగిన మత ఘర్షణలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దానిపై వాదనలను గురువారం విననుంది. పరిపాలనలో నిర్లక్ష్యం వల్ల దాదాపు 40 విలువైన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, అందువల్ల ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్ల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం కోరారు.
తొమ్మిది మంది పిటిషనర్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. బాధితులు మనుషులన్న విషయం మనం మాత్రమే ఆలోచిస్తున్నామని ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించే సందర్భంగా జస్టిస్ సింఘ్వి వ్యాఖ్యానించారు. బాధితులను వారి కులం, మతం, జాతి, రంగు ఆధారంగా వేరుచేయకూడదని గోపాల్ సుబ్రమణ్యం అన్నప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచిలో కూడా ముజఫర్పూర్ అల్లర్లపై సీబీఐ విచారణ జరిపించాలంటూ మరో పిటిషన్ దాఖలైంది.