హెచ్చుతగ్గులుంటాయ్! | Stocks may remain volatile this week amid F&O expiry: Analysts | Sakshi
Sakshi News home page

హెచ్చుతగ్గులుంటాయ్!

Dec 23 2013 4:54 AM | Updated on Nov 9 2018 5:30 PM

హెచ్చుతగ్గులుంటాయ్! - Sakshi

హెచ్చుతగ్గులుంటాయ్!

ఈ వారం మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీ: ఈ వారం మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. క్రిస్మస్ సందర్భంగా బుధవారం(25న) మార్కెట్లకు సెలవు. ఇక గురువారం(26న) డిసెంబర్ సిరీస్ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్‌ల గడువు ముగియనుంది. ఈ  నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకున్నప్పటికీ మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు.

డిసెంబర్ సిరీస్ ముగియనున్న కారణంగా ఇన్వెస్టర్లు తమ పొజిషన్లకు హెడ్జింగ్ పెట్టుకోవడం మంచిదని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. స్టాక్ ఆధారంగా పెట్టుబడులకు దిగడం మేలని సూచించారు. రానున్న వారంలో బ్యాంకింగ్, మీడియా, రియల్టీ రంగాలతోపాటు ఎఫ్‌ఎంసీజీలో కొన్ని షేర్లు వెలుగులో నిలిచే అవకాశముందని అభిప్రాయపడ్డారు. గడచిన వారంలో మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 21,080 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే.
 
లావాదేవీలు తగ్గవచ్చు
మార్కెట్లలో లావాదేవీల పరిమాణం క్షీణించే అవకాశమున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. క్రిస్మస్ సెల వుల సందర్భంగా విదేశీ ఫండ్ మేనేజర్లు మార్కె ట్లకు దూరంకానున్నారని తెలిపారు. కాగా, ప్రస్తుతానికి మార్కెట్లకు ఊపునిచ్చే అంశాలేవీలేవని, డిసెం బర్ క్వార్టర్‌కు కంపెనీలు ప్రకటించే ఫలితాలు ఇందుకు దోహదపడవచ్చునని వివరించారు. జనవరి రెండో వారం నుంచీ కార్పొరేట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ వారం కూడా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీలో జోష్ కనిపించే అవకాశమున్నదని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. సాంకేతికంగా చూస్తే పటిష్టంగా కనిపిస్తున్నదని, 6,320 వద్ద ఎదురయ్యే ప్రధాన అవరోధాన్ని అధిగమించవచ్చునని చెప్పారు. ఆపై 6,370, 6452 స్థాయిలను పరీక్షించవచ్చునని అంచనా వేశారు.
 
అంచనాలకు భిన్నంగా
గడిచిన వారంలో అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్, ఇటు దేశీయ రిజర్వ్ బ్యాంక్ అంచనాలకు భిన్నంగా పరపతి సమీక్షలను ప్రకటించాయి. 85 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీలో 10 బిలియన్ డాలర్లమేర మాత్రమే కోత పెట్టేందుకు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించగా, రెపో రేటును యథాతథంగా ఉంచేందుకే రిజర్వ్ బ్యాంక్ మొగ్గు చూపింది. దీంతో ఇకపై రాజకీయ పరిణామాలు, కార్పొరేట్ ఫలితాలపై మార్కెట్లు దృష్టిపెడతాయని  కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ హెడ్ దీపేన్ షా పేర్కొన్నారు.

సమీపకాలానికి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని మరికొంతమంది విశ్లేషకులు తెలిపారు. విదేశీ మార్కెట్ల పనితీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు కూడా కీలకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు మన్నికైన వస్తువులకు కొత్త ఆర్డర్లు, హౌసింగ్ అమ్మకాలు, నిరుద్యోగ గణాంకాలు వంటి అంశాలపై ఆధారపడి అమెరికా మార్కెట్లు స్పందించనున్నట్లు తెలిపారు. పలు అంతర్జాతీయ మార్కెట్లపై అమెరికా సూచీలు ప్రభావం చూపే విషయం విదితమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement