రాహుల్ కొంతకాలం ఆగాల్సిందే! | Sonia Gandhi given one year extension as Congress President | Sakshi
Sakshi News home page

రాహుల్ కొంతకాలం ఆగాల్సిందే!

Sep 8 2015 2:02 PM | Updated on Oct 22 2018 9:16 PM

రాహుల్ కొంతకాలం ఆగాల్సిందే! - Sakshi

రాహుల్ కొంతకాలం ఆగాల్సిందే!

సోనియా పదవీకాలం పొడిగించడంతో అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ మరికొంత కాలం నిరీక్షించాల్సి వచ్చింది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. ఆమె పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ మంగళవారం సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలను ఏడాది పాటు వాయిదా వేయాలని, అన్ని విభాగాలకు ఓకే సభ్యత్వం ఉండాలని తీర్మానించారు. పార్టీలో 50 శాతం పదవులను ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, మహిళలకు కేటాయించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది.

సోనియా పదవీకాలం పొడిగించడంతో అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ మరికొంత కాలం నిరీక్షించాల్సి ఉంటుంది. రాహుల్ నాయకత్వాన్ని సీనియర్లు గట్టిగా వ్యతిరేకించడంతో సోనియా కొనసాగాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement