పెళ్లి వేడుకలో నచ్చిన పాట పెట్టలేదని.. | Songs spark clashes at Kanpur wedding | Sakshi
Sakshi News home page

పెళ్లి వేడుకలో నచ్చిన పాట పెట్టలేదని..

Jul 13 2016 6:26 PM | Updated on Sep 4 2017 4:47 AM

పెళ్లి వేడుకలో నచ్చిన పాట పెట్టలేదని..

పెళ్లి వేడుకలో నచ్చిన పాట పెట్టలేదని..

పెళ్లి వేడుక అంటే సహజంగా ఆటలు, పాటలు, డ్యాన్స్ లతో సందడిగా ఉంటుంది.

పెళ్లి వేడుక అంటే సహజంగా ఆటలు, పాటలు, డ్యాన్స్ లతో సందడిగా ఉంటుంది. డీజే మ్యూజిక్ హోరుతో ఇలా కోలాహలంగా ఓ పెళ్లి వేడుకలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఉన్న ఓ గ్రూప్ వ్యక్తులు తమకు 'డీజే వాలా బాబు మేరా గానా బజాదే' పాట కావాలని పట్టుబడగా.. మరో గ్రూప్ వ్యక్తులు 'నాగిని ట్యూన్' అయితేనే తాము డ్యాన్స్ చేస్తామని బెట్టుచేశారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య పెద్ద గొడవ జరిగింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లి వేడుక వద్దకు వచ్చి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది. మంగళవారం రాజేంద్రకుమార్ అనే వ్యక్తి కూతురు పెళ్లి జరుగుతుండగా.. మద్యం మత్తులో ఉన్న రెండు గ్రూపులు తమకు నచ్చిన పాటనే డీజే జాకీ పెట్టాలంటూ గొడవకు దిగారు. దీంతో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి గట్టి వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement