బంగారం షాపులో పేలిన సిలిండర్.. ఆరుగురికి గాయాలు | Six injured, Cylinder blasted due to leakage at Gold shop | Sakshi
Sakshi News home page

బంగారం షాపులో పేలిన సిలిండర్.. ఆరుగురికి గాయాలు

Aug 16 2015 5:52 PM | Updated on Sep 3 2017 7:33 AM

బంగారం షాపులో పేలిన సిలిండర్.. ఆరుగురికి గాయాలు

బంగారం షాపులో పేలిన సిలిండర్.. ఆరుగురికి గాయాలు

గిద్దలూరు మండలం షరఫ్ బజార్‌లోని ఓ బంగారు ఆభరణాల తయారీ షాపులో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

ప్రకాశం(గిద్దలూరు): గిద్దలూరు మండలం షరఫ్ బజార్‌లోని ఓ బంగారు ఆభరణాల తయారీ షాపులో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఓ పాపతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. బాధితులకు సరైన వైద్యం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు డాక్టర్లను తెప్పించి వైద్యం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement