'ఇంద్రాణి మాజీ భర్త.. షీనాను చంపారు' | sheena bora killed by sanjeev khanna, driver says | Sakshi
Sakshi News home page

'ఇంద్రాణి మాజీ భర్త.. షీనాను చంపారు'

Aug 28 2015 8:47 AM | Updated on Sep 3 2017 8:18 AM

'ఇంద్రాణి మాజీ భర్త.. షీనాను చంపారు'

'ఇంద్రాణి మాజీ భర్త.. షీనాను చంపారు'

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.


ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా ఆమె కుమార్తె షీనాను గొంతు నులిమి చంపేసినట్టు వారి కారు డ్రైవర్ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం.


పోలీస్ కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్‌ని ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా స్వయంగా ఇంటరాగేట్ చేశారు. కోల్‌కతాలో అరెస్టు చేసిన మూడో నిందితుడు సంజీవ్ ఖన్నా (ఇంద్రాణి రెండోభర్త)ను పోలీసులు విచారించా రు. హత్య జరిగిన తీరు సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ ఎస్పీరాయ్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement