అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ రేపు(గురువారం) విడుదల కానున్న నేపథ్యంలో మార్కెట్లో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్: మార్కెట్లు ఆచితూచి అడుగులు
Mar 8 2017 9:49 AM | Updated on Sep 5 2017 5:33 AM
ముంబై : అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ రేపు(గురువారం) విడుదల కానున్న నేపథ్యంలో మార్కెట్లో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో బుధవారం మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 27.29 పాయింట్ల నష్టంలో 28,972 వద్ద, నిఫ్టీ 2.35 పాయింట్ల నష్టంలో 8944 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో హీరో మోటార్ కార్పొ, సిప్లా, ఓఎన్జీసీ, ఏషియన్ పేయింట్స్, టాటా స్టీల్, కొటక్ మహింద్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడాలు లాభపడగా.. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, భారతీ ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఇన్ ఫ్రాటెల్, అరబిందో ఫార్మా, ఐడియా సెల్యులార్ లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
అటు డాలర్ తో రూపాయి మారకం విలువ నిన్నటి ముగింపుకు 5 పైసలు లాభపడి 66.62 వద్ద ప్రారంభమైంది. మోదీ ప్రభుత్వానికి ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ నేటితో ముగియనుంది. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం విడుదల కానున్న ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా వస్తాయోనని ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర వరుసగా మూడో రోజు కూడా పడిపోతూ 212 రూపాయల నష్టంలో రూ.28,733 వద్ద ట్రేడవుతున్నాయి.
Advertisement
Advertisement