breaking news
opens flat
-
ఎగ్జిట్ పోల్స్: మార్కెట్లు ఆచితూచి అడుగులు
ముంబై : అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ రేపు(గురువారం) విడుదల కానున్న నేపథ్యంలో మార్కెట్లో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో బుధవారం మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 27.29 పాయింట్ల నష్టంలో 28,972 వద్ద, నిఫ్టీ 2.35 పాయింట్ల నష్టంలో 8944 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో హీరో మోటార్ కార్పొ, సిప్లా, ఓఎన్జీసీ, ఏషియన్ పేయింట్స్, టాటా స్టీల్, కొటక్ మహింద్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడాలు లాభపడగా.. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, భారతీ ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఇన్ ఫ్రాటెల్, అరబిందో ఫార్మా, ఐడియా సెల్యులార్ లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ నిన్నటి ముగింపుకు 5 పైసలు లాభపడి 66.62 వద్ద ప్రారంభమైంది. మోదీ ప్రభుత్వానికి ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ నేటితో ముగియనుంది. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం విడుదల కానున్న ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా వస్తాయోనని ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర వరుసగా మూడో రోజు కూడా పడిపోతూ 212 రూపాయల నష్టంలో రూ.28,733 వద్ద ట్రేడవుతున్నాయి. -
ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమైనాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాల నేపథ్యంలో గురువారం నష్టాలతో మొదలయ్యాయి. ప్రస్తుతం కొంచెం పుంజుకున్న సెన్సెక్స్ 21 పాయింట్లు ఎగిసి 27,278 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 8422వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రధానంగా నిఫ్టీ 8400 స్తాయికి ఎగువన ట్రేడ్ అవుతోంది. డాక్టర్ రెడ్డీస్, బీహెచ్ఈఎల్ అరబిందో,టాటా మోటార్స్, అదానీ పో్ర్ట్స్ టాప్ గెయినర్స్ గా , ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఐడియా, గెయిల్, హెచ్యూఎల్, ఐటీసీ బలహీనంగా ఉన్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి భారీ నష్టాలతోఉంది.0.27 పైసల నష్టంతో 68.23 వద్ద ఉంది. అలాగేఎంసీఎక్స్ మార్కెట్ లోపుత్తడి పది గ్రా. రూ.42 లాభపడి రూ. 28,780 వద్ద ఉంది.