ముఖేష్‌కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు | SC, ST atrocity case on Mukesh Kumar | Sakshi
Sakshi News home page

ముఖేష్‌కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Mar 6 2016 2:50 AM | Updated on Sep 15 2018 2:43 PM

ముఖేష్‌కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు - Sakshi

ముఖేష్‌కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ప్రముఖ హాకీ క్రీడాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ముఖేష్‌కుమార్‌పై హైదరాబాద్ బేగంపేట్ పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

హైదరాబాద్: ప్రముఖ హాకీ క్రీడాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ముఖేష్‌కుమార్‌పై హైదరాబాద్ బేగంపేట్ పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. సీఎం కప్ అడ్‌హక్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన తమను హాకీ ఆడేందుకు అనుమతించకపోవడమే కాకుండా కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ యశ్వంత్, నాగరాజు, వినయ్, మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

18 నుంచి 26 ఏళ్ల వారు మాత్రమే హాకీ ఆడాలని నిబంధన విధించారని, అయితే హాకీ ఆడేందుకు ఎలాంటి వయోపరిమితి లేదని, ఇదే విషయంపై తాము ముఖేష్‌కుమార్‌ను నిలదీసి అడిగినందుకు కులం పేరుతో దూషించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement